భవన నిర్మాణ కార్మికులకు,నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన : నగునూరి మహేష్..... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

భవన నిర్మాణ కార్మికులకు,నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన : నగునూరి మహేష్.....

శుభతెలంగాణ న్యూస్:మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని గాంధీనగర్ కాలనీ లో TRS కాప్రా డివిజన్  ఉపాధ్యక్షులు, పోచమ్మ  విజయదుర్గ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ నగునూరి మహేష్ మరియు గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సుమారు 150  మందికి పైగా భవన నిర్మాణ కార్మికులతో పాటు నిరుపేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగునూరి మహేష్ మాట్లాడుతూ..... గౌరవనీయులు ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారి నాయకత్వంలో పేదలకు ఉచితంగా నిత్యవసర సరుకులు, కూరగాయలు,దశలవారీగా పంపిణీ  చేస్తున్నామని.కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో వలస కూలీల ఎవరూ ఆందోళన చెందవద్దని ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల.చంద్రశేఖర రావు గారు హామీ ఇచ్చారని తెలిపారు.ఈ కార్యక్రమంలో నగునూరి కుమార్, గుడి సత్యనారాయణ,గుండె కృష్ణ, దామోదర చారి, గడ్డం సత్తయ్య, గడ్డం కృష్ణ, బీ.శివ రామకృష్ణ, బి. రాకేష్, జి.శ్రీకాంత్, పీ శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.....

 మరిన్ని చిత్రాలు:
 
                       

Post Top Ad