హమాలి కార్మికులకు అండగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 18, 2020

హమాలి కార్మికులకు అండగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్...

శుభ తెలంగాణ (18, ఏప్రిల్ , 2020) :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని 300 మంది మండల హమాలి కార్మికులకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అండగా నిలిచారు. 'కరోనా వైరస్' లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న హమాలీలకు బియ్యం మరియు నిత్యవసర వస్తువులను  అందజేశారు.

ఈ నిత్యవసర వస్తువులను ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు జి.ఐలయ్య, సిఐటియు జిల్లా నాయకులు కీలు కాని లక్ష్మణ్ అమాలి కార్మికులకు సోషల్ డిస్టెన్స్ పాటించి అందజేశారు. ఈ సందర్భంగా వామపక్ష యూనియన్ సిఐటియు, ఏఐటీయూసీ, సిపిఐ, సిపిఎంలు ఎమ్మెల్యే అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐ టియుసి అధ్యక్షులు వి.హరినాధ రావు, ప్రధాన కార్యదర్శి కె.స్వామి, డిప్యూటీ కార్యదర్శి కె.మహేష్, వామపక్ష కార్మిక నాయకులు వెంకన్న, సుంకిరెడ్డి, బీరప్ప దేవదానం, రాము, మల్లేష్, సత్తిరెడ్డి
తదితరులు పాల్గొన్నారు.