లాక్ డౌన్ లక్ష్మణరేఖ దాటవద్దు... నిబంధనలను అతిక్రమించి రిస్క్: తెలంగాణ పోలీస్.... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

లాక్ డౌన్ లక్ష్మణరేఖ దాటవద్దు... నిబంధనలను అతిక్రమించి రిస్క్: తెలంగాణ పోలీస్....

శుభతెలంగాణ న్యూస్( కరోనా వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా విధించిన లాక్ డౌన్ అమలును ఇంకా కొంత మంది అతిక్రమిస్తున్న నేపధ్యంలో సైబరాబాద్ పోలీసులు అతిక్రమణదారులపై కొరడా జులిపిస్తున్నారు. ఇప్పటికే 478 కేసులు నమోదు చేసిన పోలీసులు వేలాదిగా వాహనాలను జప్తు చేయడం జరిగింది. ఇప్పటికే నగరం మొత్తం మీద 7 లక్షల పైగా ఉన్న CCTV కెమెరాలలో, సైబరాబాద్ లో ఉన్న లక్షా పదిహేను వేల కెమెరాలను కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేయడం జరిగింది. వీటి ద్వారా రోడ్ల మీద ప్రజల కదలికలు ఎప్పటికప్పుడు గమనించడం జరుగుతుంది.
ఇదే కాకుండా పలు ప్రాంతాల్లో ద్రోన్ల ద్వారా ప్రజల కదలికలు పసిగట్టి చర్యలు తీసుకోబడ్డవి. ఇప్పుడు పోలీసు వారి అమ్ముల పొదిలో మరో సాంకేతిక అస్త్రం జత అయ్యింది. ఇదే “లాక్ డౌన్ వయొలేషన్ ట్రాకింగ్ అప్లికేషన్”. దీనిని తెలంగాణ పోలీసు శాఖ తయారు చేయగా, అన్ని చెక్ పోస్టులలో ఉన్న అధికారులకు టాబ్ లలో ఇన్స్టాల్ చెయ్యడం జరిగింది. ఎవరైనా ఒక వ్యక్తి రోడ్ మీదకు వచ్చిన వెంటనే సమీపంలో ఉన్న పోలీసు అధికారి అతని వివరాలు టాబ్ లో నమోదు చెయ్యడం జరుగుతుంది. అట్టి వ్యక్తి ఆ ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే అదికూడా కేవలం అత్యవసరాల నిమిత్తం మాత్రమే బయటకు వెళ్లవచ్చు. అది కూడా GO: 45, 46 లలో పేర్కొన్న నిబంధనల మేరకు, మోటార్ సైకల్ పై ఒక వ్యక్తి, కార్ లో డ్రైవరు కాక మరొక వ్యక్తికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ మూడు కిలోమీటర్ల పరిధిని దాటినట్లైతే అట్టి వ్యక్తి వాహనాన్ని జప్తు చేసి, వారిపై “జాతీయ విపత్తుల నియంత్రణ చట్టం”, “అంటువ్యాధుల నివారణ చట్టం” మరియు “భారతీయ శిక్షా స్మృతి” మేరకు కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. దీన్ని అతిక్రమించిన వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా కూడా పడే అవకాశం ఉంది. జప్తు చేయబడిన వాహనం ఇప్పట్లో విడుదల చేసే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ప్రజలు ఎవరైనా కూడ అనవసరంగా రోడ్ల మీదకు రారాదు. ఒకవేళ అత్యవసరంగా రావాల్సి వస్తే, నిబంధనల మేరకు మాత్రమే రావాలి. ప్రతి చిన్న అవసరానికి బయటకు రాకుండా కనీసం రెండు మూడు రోజుల పాటు సరిపోయేలా అన్ని రకాల నిత్యావసరాలను ఒకేసారి కొనుగోలు చేసుకోవాలి. ఈ విధంగా బయటకు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన వారు కూడా, ఖచ్చితంగా మాస్క్ ధరించవలెను, మనుషుల మధ్య కనీసం 3 మీటర్ల దూరం పాటించాలి. రోడ్ల మీద అనవసరంగా ఉమ్మ కూడదు. తరచుగా మీ చేతులను సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కొవాలి. లేదా శానిటైజర్ ఉపయోగించ వచ్చు. ఈ నిబంధనలు అన్ని మీ కోసం, మీ కుటుంబ సభ్యుల కోసం ఇంకా మన సమాజ శ్రేయస్సు కోసం కాబట్టి ప్రజలందరూ సహకరించి, ఈ కరోనా రక్కసిని మన సమాజం నుండి పారదోలుదాo. "నిబంధనలను అతిక్రమించి రిస్క్ తీసుకోరాదని ప్రజలకు విజ్ఞప్తి". 

Post Top Ad