లాక్ డౌన్ వేల వినూత్న కార్యక్రమం : డ్రోన్ ద్వారా దోమల నివారణ మందు పిచికారి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 23, 2020

లాక్ డౌన్ వేల వినూత్న కార్యక్రమం : డ్రోన్ ద్వారా దోమల నివారణ మందు పిచికారి

శుభ తెలంగాణ (23,ఏప్రిల్,2020-  అల్వాల్) :  కరోనా కట్టడిలో భాగంగా కొనసాగుతున్న లాక్ డౌన్ వల్ల అనేక పనులు ఆగిపోయాయి. ఈ సమయంలో  ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అల్వాల్ సర్కిల్ 133 డివిజన్ మచ్చ బొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేంద్ర నాథ్ అన్నారు. గురువారం అల్వాల్ మున్సిపల్ సర్కిల్ లోని కొత్త చెరువు, చిన్న చెరువులో దోమలు విజృంభిస్తున్నదున మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ ద్వారా డ్రోన్ ద్వారా దోమల నివారణ మందు పిచికారి చేయించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు, సీనియర్ ఎంటమాలజిస్ట్ లచ్చి రెడ్డి, డిసి తిప్పర్తి యాదయ్య, డి.మహేష్, సిఐ పులి యాదగిరి, ఎన్జ వరప్రసాద్, స్థానిక నాయకులు సురేందర్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, బల్వంత్ రెడ్డి, మహేష్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.