గ్రామ సర్పంచులకు రసాయన మందులను పంపిణీ చేస్తున్న జడ్పీ వైస్ చైర్మన్ ఎంపీపీ..... - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 10, 2020

గ్రామ సర్పంచులకు రసాయన మందులను పంపిణీ చేస్తున్న జడ్పీ వైస్ చైర్మన్ ఎంపీపీ.....

శుభతెలంగాణ న్యూస్(వికారాబాద్ జిల్లా) :గ్రామాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత గ్రామ సర్పంచ్ ల పై కార్యదర్శిపై ఆధారపడి ఉండదు మోమిన్ పేట  ఎంపీపీ వసంత వెంకట పేర్కొన్నారు శుక్రవారం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండలంలోని సర్పంచులు రసాయన మందులు పిచికారి చేయడం కోసం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భయంకరమైన కరోనా మహమ్మారి తరిమికొట్టేందుకు గ్రామ సర్పంచులు ఎంపిటిసిలు పంచాయతీ  కార్యదర్శులు ఎప్పటికప్పుడు జాగ్రత్త పాటించాలన్నారు పల్లె ప్రగతి కార్యక్రమంగా మురుగు కాలువలు గ్రామాల్లో చెత్త లేకుండా శుభ్రం చేశారు కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రజలను పట్టిపీడిస్తున్న నందున ప్రతిరోజు క్రమం తప్పకుండా రసాయన మందులు పిచికారి చేయాలన్నారు దీని ద్వారా భయంకరమైన వ్యాధి నుండి కొంతవరకు ప్రజలను రక్షించుకోవచ్చు అని ఆమె తెలిపారు మండలంలోని 29 గ్రామాల్లో వ్యాధి నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని అయినప్పటికీ మరింత శ్రద్ధ చూపాల్సిన బాధ్యత గ్రామస్తులపై ఆధారపడి ఉందన్నారు గ్రామాల్లోని ప్రజలు అందరూ గృహ నిర్బంధంలో ఉండి ప్రభుత్వానికి సహకారం అందించాలని ఆమె సూచించారు కరుణ వ్యాధికి మందు లేదని నివారణ ఒక్కటే మార్గమని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్  మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు  నరసింహారెడ్డి పిఎసిఎస్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ సభ్యులు పార్టీ నాయకులు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.... 

Post Top Ad