కరీంనగర్ జిల్లాలో కరోనా కొంతమేర అదుపులోకి వచ్చింది :మంత్రి గంగుల - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 24, 2020

కరీంనగర్ జిల్లాలో కరోనా కొంతమేర అదుపులోకి వచ్చింది :మంత్రి గంగుల

శుభ తెలంగాణ (24,ఏప్రిల్,2020 - కరీంనగర్) : కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ ఇప్పటికే కొంత మేరకు అదుపులోకి వచ్చినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం స్థానిక జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... రాబోయే రోజుల్లో మళ్లీ కరోనా వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ నియమాలను పాటించాలని సూచించారు.