తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం,స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 28, 2020

తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం,స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు


శుభ తెలంగాణ (28, ఏప్రిల్ , 2020) :   తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం,స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... “నా నియోజకవర్గానికి అన్నీ తానే. ఇక్కడికి ఎవరు రావాలన్నా నా అనుమతి తప్పనిసరి. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే తండ్రి. మంత్రి. పార్టీకి వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న వారి పై కఠిన చర్యలు తప్పవు. ఒక తల్లి, తండ్రికి పుట్టిన వారయితే తల్లి రొమ్ము కోసే ప్రయత్నం చేయవద్దు." అని రాజయ్య భావోద్వేగంగా మరియు ఆవేశపూరితంగా ప్రసంగించారు. కడియం శ్రీహరి, రాజయ్య వర్గాల మధ్య గత కొంత కాలంగా విబేధాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కడియం తన పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తునట్టు సమాచారం. అందువల్లే రాజయ్య కాస్త డోస్ పెంచి మాట్లాడినట్టు తెలుస్తోంది.