భారత్ లో భారీగా ఉద్యోగాల కోత? - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 10, 2020

భారత్ లో భారీగా ఉద్యోగాల కోత?

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోన్న
సమయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) అన్ని దేశాలను హెచ్చరించింది. సంస్థ చీఫ్ రాబెర్టో అజెవెడో మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య రంగంఈ ఏడాది 13-32 శాతం మధ్య నష్టపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. భారత్ లో కూడా భారీగా ఉద్యోగాల్లో కోత పడనుంది. సుమారు 40 కోట్ల మంది పేదరికంలోకి వెళ్లే ప్రమాదముందని ప్రపంచ వాణిజ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పటికే భారత్ లో చాలా మంది ఉద్యోగాలను కోల్పోయారు. పలు స్టార్టప్ లు ఇప్పటికే కొందరిని తొలగించాయి. మల్టీనేషనల్ కంపెనీలు కూడా కొంతమంది ఉద్యోగులను తీసేయక తప్పని పరిస్థితిని ఎదుర్కొన్నాయి. వీటితోపాటు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మింత్రా, స్విగ్గి, ఉబెర్, ఓలా లాంటి
సంస్థలు కూడా తమ కార్యకలాపాలను ఆపేసాయి. ఇప్పటికే భారత్ లో చాలా చోట్ల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఈ- కామర్స్ సెక్టార్ తో పాటు పర్యాటక, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ ఇలా అన్ని రంగాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపించింది. చిన్నచిన్న వ్యాపారస్తులు, రోజువారీ కూలీలు,
వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరూ పనుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. నివేదికల ప్రకారం భారత్ లో నిరుద్యోగ శాతం 23 కు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉంది.

Post Top Ad