మేడ్చల్ జిల్లా కాప్రా లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 14, 2020

మేడ్చల్ జిల్లా కాప్రా లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు...

శుభతెలంగాణ (14ఏప్రిల్20):మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ లోని గాంధీనగర్ లో గాంధీనగర్ వెల్ఫేర్ మరియు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో "ప్రపంచ విజ్ఞాన్ దివస్" గా జరుపుకొనబడు  భారత రాజ్యాంగ నిర్మాత "బాబాసాహెబ్ డా.బి.ఆర్ అంబేడ్కర్" గారి 129 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగనూరి మహేష్ తోపాటు బహుజన నాయకులు, బస్తీ వాసులు,అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలు  వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నాగునూరి మహేష్ మాట్లాడుతూ....అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయన అడుగుజాడల్లో నడుస్తామని ప్రతిజ్ఞ చేశారు.
అనంతరం యూత్ అధ్యక్షుడు జి.సత్యనారాయణ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు అందరు  కృషిచేయాలని  పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో గాంధినగర్ మహిళా నాయకులు శ్రీమతి మణెమ్మ గారు,సురేఖ గారు, లక్ష్మీ గారు,వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎం.భిక్షపతి ,ఎన్.బాలయ్య, పి.కృష్ణ, జి.బాలయ్య,ఎన్.పద్మా రావ్,ఎన్. శ్రీనివాస్, ఎన్.అనిల్ కుమార్,నరసింహ గార్లు మరియు యూత్ అసోసియేషన్  సెక్రెటరీ డి ప్రభాకర్, బి శివరామ కృష్ణ, కె వెంకట్, శ్రీహరి,బి రాకేష్, అశోక్,జి కృష్ణ,  హరిబాబు, గౌతమ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని చిత్రాలు :Post Top Ad