సీఎం సహాయనిధికి ఐకేపీ విఓల విరాళం - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 08, 2020

సీఎం సహాయనిధికి ఐకేపీ విఓల విరాళం

వాళ్ళు చిరుద్యోగులు, చిన్న జీత‌గాళ్ళు అయితేనేమీ…అంత‌కంటే పెద్ద మ‌న‌సున్నోళ్ళు… వారి జీతాల్లోంచి తలా ఇంత పోగ‌సి కోటి 72ల‌క్ష‌ల 61వేల విరాళాన్ని సీఎం స‌హాయ నిధికి అంద‌చేశారు. రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు నేతృత్వంలో ఆ మొత్తానికి చెక్కుని రాష్ట్ర ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ కి ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో అంద‌చేశారు. ప్ర‌పంచం స‌హా, రాష్ట్రం క‌రోనా క‌ష్ట‌కాలంలో ఉంది. ఈ నేప‌థ్యంలో క‌రోనా క‌ట్టడి కోసం సీఎం స‌హాయ నిధికి అనేక మంది స‌హాయ‌ మందిస్తున్నారు. ఇదే త‌ర‌హాలో రాష్ట్రంలోని 17,261మంది ఐకెపి విఓఎలు మేమున్నామంటూ.. ముందుకు వ‌చ్చారు.

త‌మ నెల జీతం రూ.5వేల నుంచి ఒక్కొక్క‌రు ఒక్కో వెయ్యి రూపాయ‌ల‌ను పోగేసారు. మొత్తం రూ. కోటి 72ల‌క్ష‌ల 61వేలను రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖా మాత్యులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు నేతృత్వంలో సోమ‌వారం సీఎం కేసీఆర్ కు చెక్కు రూపంలో అంద‌చేశారు. ఐకెపి విఓఎలను, వాళ్ళ‌ని స‌మ‌న్వ‌యం చేసిన విఓఎల సంఘాన్ని, టీఆర్ఎస్ కార్మిక విభాగాన్ని సీఎం కేసీఆర్, మంత్రి ద‌యాక‌ర్ రావులు అభినందించారు. సీఎంను క‌లిసిన వాళ్ళ‌ల్లో టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు రాంబాబు, తెలంగాణ ఐకెపి విఓఎల సంఘం గౌర‌వాధ్య‌క్షుడు ఎల్. రూప్ సింగ్, రాష్ట్ర అధ్య‌క్షుడు మంచిక‌ట్ల కోటేశ్వ‌ర్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి మారిపెల్లి మాధ‌వి, కోశాధికారి పి.తిరుప‌తి త‌దిత‌రులు ఉన్నారు.

Post Top Ad