నిర్లక్ష్యంగా ఉమ్మి వేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 13, 2020

నిర్లక్ష్యంగా ఉమ్మి వేసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు

శుభ తెలంగాణ  (13, ఏప్రిల్,2020) : అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం చెక్ పోస్ట్ వద్ద రోడ్డుపై నిర్లక్ష్యంగా ఉమ్మి వేసిన ఇద్దరు వ్యక్తులపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. అబ్దుల్లాపూర్ మెట్ సీఐ దేవేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండల మల్కాపురం వెళ్లి వస్తున్నారు. కొత్తగూడెం చెక్ పోస్ట్ వద్ద వీరి బైక్ ను అపి తనిఖీ చేయగా నిర్లక్ష్యంగా రోడ్డుపైనే ఉమ్మి వేశారు. దీంతో హాజీ పాషా, మీర్ జహంగీర్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Post Top Ad