శుభ తెలంగాణ (26,ఏప్రిల్ ,2020 - కరీంనగర్ ) : కరీంనగర్ లో పలు సేవా కార్యక్రమాల్లో నగర మేయర్ వై.సునీల్ రావు పాల్గొన్నారు. నగరంలోని 38 వ డివిజన్ లో శ్రీహరి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్మికులకు, పేద ప్రజలకు సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై...పారిశుధ్య కార్మికులు, కాలనీలోని పేద ప్రజలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. శ్రీనగర్ కాలనీ అసోసియేషన్ సహాకారంతో దాదాపు 150 పేద కుటుంబాలకు సరుకులను అందించి ఆకలి తీర్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణీ హారిశంకర్, కార్పోరేటర్ కచ్చు రవి, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Post Top Ad
Sunday, April 26, 2020
సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కరీంనగర్ మేయర్ వై.సునీల్ రావు
Admin Details
Subha Telangana News