లాక్ డౌన్ వల్ల ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అప్లికేషన్లు భారీగా తగ్గాయి - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 29, 2020

లాక్ డౌన్ వల్ల ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అప్లికేషన్లు భారీగా తగ్గాయి

లాక్ డౌన్ వల్ల అన్ని ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడటంతో అప్లికేషన్లు భారీగా తగ్గాయి. ఎంసెట్, ఈసెట్, పీజీ ఈసెట్, ఎడ్ సెట్, పీఈసెట్, లాసెట్ తో పాటు మిగిలిన ప్రవేశ పరీక్షలకు గతేడాది కంటే తక్కువ దరఖాస్తులే వచ్చాయి. ముఖ్యంగా
ఎంసెట్ కు (ఇంజినీరింగ్, అగ్రికల్చర్) గతేడాది 2,17,799 అప్లికేషన్లోస్తే, ఈసారి ఇప్పటి వరకూ 1,90,141 దరఖాస్తులే వచ్చాయి. ఇంజినీరింగ్ విభాగంలో గతేడాది 1,42,210 - అప్లికేషన్లు రాగా, ఈసారి 1,23,377, అగ్రికల్చర్, ఫార్మసీలో గతేడాది 74,989 దరఖాస్తులు వస్తే, ఈసారి 66,764
వచ్చాయి.