హైదరాబాద్ లో లాక్ డౌన్ వేల భారీ ట్రాఫిక్ జామ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 22, 2020

హైదరాబాద్ లో లాక్ డౌన్ వేల భారీ ట్రాఫిక్ జామ్

శుభ తెలంగాణ (22 , ఏప్రిల్ , 2020 - కూకట్ పల్లి ) : తెలంగాణ లో కరోనా  వైరస్ కట్టడి కోసం నిర్వహిస్తున్న లాక్ డౌన్ వేల , హైదరాబాద్ నగర నది ఒడ్డున భారీ ట్రాఫిక్ జామ్ నెల కొంది . ఏంటీ లాక్ డౌన్ వేల ట్రాఫిక్ జామ్ అని అనుకుంటున్నారా...? అవును హైదరాబాద్ నగరం కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. ఒక్క సారిగా అందరూ రోడ్ల మీదకు రావడంతో వారి అందరినీ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. లాక్ డౌన్ వేళ అంతా ట్రాఫిక్ జామ్ కావడంతో సీపీ అంజని కుమార్ రంగంలోకి దిగి అక్కడి పరిస్థితులను చక్క దిద్దారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారి వెహికల్స్ ను సీజ్ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప ఎవరు బయటకి రావొద్దని, మే 7వ తారీఖు వరకు ఇలాగే పరిస్థితి ఉంటుందని సీపీ అంజని కుమార్ తెలిపారు.

Post Top Ad