చేనేత కార్మికులకు నిత్యవసరాలు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 24, 2020

చేనేత కార్మికులకు నిత్యవసరాలు పంపిణీ

శుభ తెలంగాణ (24, ఏప్రిల్ , 2020 - వరంగల్ ప్రాంతీయం) : కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాక్ డౌన్ నేపథ్యంలో పద్మశాలి యువజన సేవాసంగం ట్రస్ట్, చర్బౌలి, గిర్మాజీపెట్ ఆధ్వర్యంలో వీవర్స్ కాలనీ, బూర కనకయ్య కాలనీ, మార్కండేయ కాలనీ ప్రాంతాలలో 250 మంది చేనేత కార్మికులకు 5 కిలోల బియ్యం , 5 రకాల నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుండు ప్రభాకర్ పాల్గొని కార్మికులకు పంపిణీ చేసి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ  స్వీయ నిర్బంధంలో ఉండాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రజలందరూ వ్యక్తిగత శుభ్రతను పాటించాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు ధరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు వడ్నాల మల్లయ్య, సంగెపు సత్యనారాయణ, ఎలుగం వీరస్వామి, దాసరి ప్రేమ్ సాగర్, గుడిమల్ల మహేశ్వర్ రావు, పిట్ట రాములు, ఆడెపు రవి, దానం రాజయ్య, ఆడెపు రమేష్ తదితరులు పాల్గొన్నారు.