కరోనా కట్టడికి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 19, 2020

కరోనా కట్టడికి కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


శుభ తెలంగాణ (19, ఏప్రిల్ , 2020) : కీసర మండలంలోని చిర్యాల గ్రామాన్ని కాంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన్నందున జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చీర్యాల గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన కేసును గాంధీ ఆస్పత్రికి తరలించడం జరిగిందని.. 64 మంది అనుమానితులను రాజేంద్రనగర్ లోని ఎన్ ఐ.ఆర్.డి క్వారంటైన్ కు పంపించడం జరిగింది. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు.

గ్రామంలో ప్రజలెవరూ బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామం మొత్తం బ్లీచింగ్ , హైడ్రోక్లోరైడ్ ను చల్లి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఈ సందర్శినలో మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి, కీసర ఆర్డఓ రవి, డియం అండ్ హెచ్ ఓ వీరంజనేయులు, కీసర తహసిల్దార్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.