సీఎంలతో ముగిసిన ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌......... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

సీఎంలతో ముగిసిన ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌.........

దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ముగిసింది. మర్కజ్‌ వెళ్లొచ్చినవారి వివరాలను సేకరణ సహా కరోనా పాజిటివ్‌ కేసులు పెరగకుండా తీసుకున్న చర్యలను సీఎంలు వివరించారు.

అనంతరం ప్రధాని మాట్లాడుతూ.. ‘‘కరోనా కట్టడికి రాష్ట్రాలన్నీ ఒక్కటై కృషిచేయడం ప్రశంసనీయం. లాక్‌డౌన్‌ ముగిశాక ప్రజలంతా మూకుమ్మడిగా బయటకు వచ్చే అవకాశం ఉంది.ఇదే జరిగితే మరోసారి కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా పరిష్కార వ్యూహాన్ని రూపొందించుకోవాలి.
ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కరోనా కట్టడి కోసం స్వచ్ఛంద సంస్థలు, సంక్షేమ సంస్థల సాయం తీసుకోండి’’ అని సూచించారు. ఈ క్లిష్ట సమయంలో ప్రధాని తన నాయకత్వ ప్రతిభను చూపారని సీఎంలు అన్నారు.

Post Top Ad