శుభతెలంగాణన్యూస్ :హైదరాబాద్ హస్తినపురంలోని అనుపమ్మ నగర్లో పారిశుద్ధ్య కార్మికుల కోసం గత కొంత కాలం క్రితం ఆస్ట్రేలియా నుంచి వచ్చి హైదరాబాద్ లో నివాసం ఉంటున్న సింధు రెడ్డి పారిశుధ్య కార్మికులకు తన వంతు సాయం చేశారు. వనస్థలిపురం సి.ఐ వెంకటయ్య పారిశుద్ధ్య కార్మికులకు నెల రోజులకి సరిపడా
నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. సి.ఐ వెంకటయ్య మాట్లాడుతూ.. గత కొంత కాలం క్రితం బయట దేశం నుంచి వచ్చిన సిందురెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు తన సొంత డబ్బులతో నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం చాలా అభినందనీయం అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సింధు రెడ్డిని
ఆదర్శంగా తీసుకొని ఇలాంటి పరిస్థితుల్లో ముందుకు వచ్చి ప్రజలకు సేవలు చేయాలని అన్నారు.