లాక్ డౌన్ పెంచడానికి కేంద్రం మొగ్గు.... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 09, 2020

లాక్ డౌన్ పెంచడానికి కేంద్రం మొగ్గు....

కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో లాక్ డౌన్
పొడిగించడానికే కేంద్రం మొగ్గుచూపుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ ఇటీవల తన ప్రసంగంలో కరోనాపై సుదీర్ఘ పోరాటానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునివ్వడం ద్వారా విస్పష్టమైన సంకేతాలు ఇచ్చారని  నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లాక్ డౌన్ పొడిగింపుపై మోదీ అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని అంచనా వేస్తున్నారు. ఆర్ధిక వ్యవస్థకు పెనుభారం అయినప్పటికీ మోదీ సహా కేంద్రమంత్రులంతా లాక్ డౌన్ కొనసాగించడానికే సుముఖంగా ఉన్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే, ఎన్నాళ్లు పొడిగించాలనే దానిపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది. కానీ, ప్రధానంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
నిరుపేదల పరిస్థితిపై చర్చలు జరుపుతున్నాయని తెలుస్తోంది. అట్టడుగు వర్గాల ప్రజల ఆకలికేకలు తీర్చడంపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించనున్నాయి. లాక్ డౌన్ కారణంగా పనుల్లేక వలసకూలీలు, నిరుపేదలు, దిగువ మధ్య తరగతి ప్రజలు ఎన్నో
అవస్థలు పడుతున్నారు. కొన్నిచోట్ల పూట గడవడం కూడా కష్టంగా ఉంది. లాక్ డౌన్ పొడిగిస్తే వీరి సమస్యలు మరింత తీవ్రతరం కానున్నాయి. చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రాన్ని కోరారు.

Post Top Ad