కరోనా మహమ్మారి నియంత్రణ మరియు అవగాహనపై గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

కరోనా మహమ్మారి నియంత్రణ మరియు అవగాహనపై గీతాన్ని ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు కరోనా మహమ్మారి నియంత్రణ మరియు అవగాహనపై రాత్రి లేదు పగలు లేదు, కంటి మీద కునుకులేదు, మన కోసం
అనే ప్రత్యేక గీతాన్ని హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం కరోనా మహమ్మారి నియంత్రణ, అవగాహన కోసం అనుక్షణం ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమన్వయం చేసుకొని కరోనా మహమ్మారి కట్టడికి కృషి చేస్తున్నారన్నారు. ఈ అవగాహన గీతాలను రచించిన రచయితలను,
గాయకులను మంత్రి అభినందించారు.

Post Top Ad