బైక్ మెకానికలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 17, 2020

బైక్ మెకానికలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్

శుభ తెలంగాణ (17, ఏప్రిల్ , 2020) :  కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటించడంతో ఆపద వేళలో ఆదుకునేందుకు ముందుకు రావడం  అభినందనీయమని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం తరపున బైక్ మెకానికలకు 100 మందికి నిత్యావసర సరుకులను అదనపు కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కరోనా వల్ల ఎంతో మంది  ఇబ్బందులకు గురవుతున్నారని, విపత్కర స్థితిలో దాతలు స్పందించి వారికి అండగా నిలవడం సంతోషకరమన్నారు. రోజువారి ఉపాధి పొందే మెకానిక్ లకు సాయం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజకుమార్, వెంకట్ రెడ్డి, శ్రావణ్, శ్రీనివాస రెడ్డి, హరికిరణ్, విజయ్, మాన్విథ్ తదితరుల పాల్గొన్నారు.

Post Top Ad