కరోనా నివారణకు విరాళం అందచేసిన డి.ఐ.సి.సి.ఐ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 15, 2020

కరోనా నివారణకు విరాళం అందచేసిన డి.ఐ.సి.సి.ఐ

శుభ తెలంగాణ (15,ఏప్రిల్ , 2020 - హైదరాబాద్ ) : కరోన వ్యాధి విస్తరిస్తున్న నేపధ్యంలో ముఖ్య మంత్రి కేసీఆర్ తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలలో మేముసైతం అంటూ ముందుకొచ్చారు దళిత పారిశ్రామికవేత్తలు. దళిత్ ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (DICCI ) తరపున మంగళవారం అంబేడ్కర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు తోడ్పాటుగా తమవంతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు దళిత గిరిజన పారిశ్రామిక వేత్తలు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, అందోల్ ఏమ్మెల్యే క్రాంతికిరణ్ మరియు డి.ఐ.సి.సి.ఐ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్రా రవికుమార్, దక్షిణ భారత ఉపాధ్యక్షుడు చంటి రాహుల్ కిరణ్, రాష్ట్ర అధ్యక్షుడు కత్తెరపక రవికుమార్, సురేష్ నాయక్, మునీందర్ పాల్గొన్నారు.

Post Top Ad