తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువు పెంపు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 08, 2020

తెలంగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువు పెంపు

కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ పరీక్షలు ఆగిపోయాయి. అన్ని ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. తెలంగాణ ఎంసెట్ కు మార్చి 31తో దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే కరోనా నేపథ్యంతో ఎంసెట్ గడువును ఏప్రిల్ 20వరకు పెంచుతునట్టు అధికారులు
ప్రకటించారు. ఏప్రిల్ 20 వరకు ఎటువంటి ఫైన్ లేకుండా ఎంసెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

రూ.500 ఫైన్ తో ఏప్రిల్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 1000 ఫైన్ తో ఏప్రిల్ ఏప్రిల్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులలో తప్పులు దొర్లితే ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 23 వరకు ఎడిట్ చేసుకోవచ్చు. మే 1 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ వారికి మే 4, 5, 7వ తేదీల్లో, అగ్చికల్చర్, మెడికల్ గ్రూపుల అభ్యర్థులకు 
మే 9, 11 న పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ కొనసాగితే ఈ షెడ్యూల్ లో మార్పు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Post Top Ad