నిరుపేదలకు, వలస కార్మికులకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ.... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 14, 2020

నిరుపేదలకు, వలస కార్మికులకు నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ....

శుభతెలంగాణ(14ఏప్రిల్20) మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధి లోని గాంధీనగర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధి కోల్పోయిన  నిరుపేదలకు మరియు ఇతర రాష్ట్రాల నుండి వలస  వచ్చిన కార్మికులుకు తినడానికి తిండి లేక ఆకలితో అలమటిస్తున్న వారిని గుర్తించి సుమారు150 మందికి పైగా కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి నిత్యవసర సరుకులు,కూరగాయలు, బిస్కెట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యూత్ అధ్యక్షులు శ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ.... కరోనా వైరస్ మహమ్మారి  కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్  విధించడంతో ఎంతో మంది కార్మికులు ఉపాధి  కోల్పోయారని.ఈ కష్ట సమయంలో ప్రతి ఒక్కరినీ ఆదుకునే బాధ్యత మనపై ఉందని మానవత్వంతో వారికి తోచిన సహాయం చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యూత్ అసోసియేషన్ సభ్యులు జి.బాలయ్య,కురునెల్లి వెంకట్,బి.శివరామకృష్ణ జి.సత్యనారాయణ,జి.కృష్ణ,రామ్ చందర్, కృష్ణ,    శ్రీహరి,బి.రాకేష్,అశోక్, హరిబాబు, గౌతమ్, బన్నీ  పాల్గొన్నారు..


మరిన్ని చిత్రాలు :











Post Top Ad