పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 24, 2020

పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

శుభ తెలంగాణ (24,ఏప్రిల్,2020 - హైదరాబాద్ ప్రాంతీయం) : కరోనా వైరస్ కట్టడికి కొనసాగుతున్న  లాక్ డౌన్ కారణంగా చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పేదలు, వలస కూలీలు, కార్మికులకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ భరోసాగా నిలిచారు. పదివేల  మందికి సరిపడా నిత్యావసరాలను పంపిణి చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం నియోజకవర్గంలోని 8 జీహెచ్ఎంసి డివిజన్లకు  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరి రావు, కొలుకుల జగన్, మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు మహ్మద్ రఫీ, కేఎం గౌరిష్ పాల్గొన్నారు.

Post Top Ad