కరీంనగర్ లో నిరుపేదలకు నిత్యావసరకుల పంపిణి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 23, 2020

కరీంనగర్ లో నిరుపేదలకు నిత్యావసరకుల పంపిణి


శుభ తెలంగాణ (23,ఏప్రిల్,2020- కరీంనగర్ ) : కరీంనగర్ లో   ఐఎంఎ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎడవల్లి విజయేంద్ర రెడ్డి నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోజు కూలీ పనులు చేసుకునేవారు నిత్యవసర సరుకులు కూరగాయలు కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారన్నారు. కరోనా మహమ్మారి తరిమికొట్టేందుకు ప్రజలందరూ ప్రభుత్వాలకు సహకరించాలని అని కోరారు. వైద్యులు ప్రజల  ప్రాణాల కోసం పనిచేస్తున్న వైద్యులపై దాడులు జరగడం హేయమైన చర్య అన్నారు. కరోనా కట్టడిలో వైద్యులు నిరంతర సేవలు అందిస్తూ, ప్రజా శ్రేయస్సు కోసం పరితపిస్తున్న వైద్య సేవలు ఎనలేనివి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పర ప్రవీణ్, ఉప్పరి నవీన్, శ్రీనివాస్, వినోద్, విజయ్, బత్తుల రాము, గోపి, శ్రీధర్, ప్రసన్నకుమార్, అజయ్
తదితరులు పాల్గొన్నారు.