కరోనా శుభవార్త : వాక్సిన్ టెస్టింగ్ మొదటి దశ విజయవంతం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 30, 2020

కరోనా శుభవార్త : వాక్సిన్ టెస్టింగ్ మొదటి దశ విజయవంతం

9
ప్రపంచం : కరోనా ప్రపంచాన్ని వణికిస్తున్న వేల అందరి చూపు మందు అదే వ్యాక్సిన్ వైపే , దీని కోసం ప్రపంచంలో ని అన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి . ఇందులో ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల బృందం శుభవార్త తెలియచేసింది . కోతులపై చేసిన ప్రయోగాలు విజయవంతం అయ్యాయని ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఆరు కోతులకు వ్యాక్సిన్ ఇవ్వగా.. 28 రోజుల తర్వాత కూడా అవి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాయని వారు చెప్పారు. కరోనా వ్యాక్సిన్ ప్రయోగాల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కోతులను ఉపయోగించారు. మానవ కణజాలాలకు బాగా సారూప్యత కలిగిన కోతులు కొన్నింటికి వ్యాక్సిన్ ఇవ్వగా, మరి కొన్నింటికి వ్యాక్సిన్ ఇవ్వలేదు. వీటన్నింటినీ కరోనా వైరస్ ప్రభావానికి గురి చేసినప్పుడు.. వ్యాక్సిన్ ఇచ్చిన ఆరు కోతులు ఆరోగ్యంగా ఉన్నాయి. కాని మిగతా కోతులు కరోనా వైరస్ ప్రభావానికి గురయ్యాయని ఆక్స్‌ఫర్డ్ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను మానవులపై ప్రయోగించారు. వాటి ఫలితాలు మరో రెండు వారాల్లో వస్తాయని చెప్పారు. కాగా, మే నెలాఖరుకు 6వేల మందిపై ప్రయోగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయోగాలన్నీ విజయవంతం అయితే సెప్టెంబర్ ఆఖరు నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఆక్స్‌ఫర్డ్ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కోతులపై జరిగిన ప్రయోగంతో వ్యాక్సిన్ రూపకల్పనలో ఎంతో పురోగతి సాధించినట్లేనని ఆక్స్‌ఫర్డ్ బృందం స్పష్టం చేసింది త్వరలోనే వ్యాక్సిన్ తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేసారు .