కరోనా నమూనా చిత్ర పటాన్ని ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 08, 2020

కరోనా నమూనా చిత్ర పటాన్ని ఆవిష్కరించిన రాచకొండ సీపీ మహేష్ భగవత్...

శుభతెలంగాణ న్యూస్ :జనాల్లో కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ భీమా రాజు తయారు చేసిన కరోనా నమూనా చిత్ర పటాన్ని ఉప్పల్ రింగ్ రోడ్డు కూడలి వద్ద రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆవిష్కరించారు. మహేష్ భగవత్ మాట్లాడుతూ కరోనా వైరస్ చిత్ర నమూనా ఎలా ఉంటుందనేది అందరూ గుర్తు పట్టేలా కరోనా చిత్ర పటాన్ని ఏర్పాటుచేసమన్నారు. ప్రపంచంలో కరోనా ప్రభావంతో చాలా మంది చనిపోతుంన్నందున అందరూ సోషల్ డిస్టన్స్ పాటించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో బైక్ పై ఒక్కరూ, కారులో ఇద్దరు, వారుండే ప్రదేశం నుండి మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించాలన్నారు. అందరూ రేషన్ షాప్ ల వద్ద, కూరగాయల మార్కెట్ వద్ద మూడు మీటర్ల సోషల్ డిస్టన్స్ పాటించాలన్నారు. మాస్కులు ధరించి, షానీటైజరు తప్పకుండా ఉపయోగిస్తుండాలన్నారు. చేతులను శుభ్రంగా కడగాలన్నారు. సాయంత్రం 6తరువాత మెడికల్ షాప్ లు తప్ప కిరాణా షాప్స్, మార్కెట్లు బంద్ చెయ్యలన్నారు. లాక్ డౌన్ ని అందరూ పాటించి కరోనా వైరస్ ప్రభావాన్ని తగ్గియ్యాలన్నారు. కరోనా సంబంధించిన ప్రబ్లేమ్స్ గూర్చి తెలుసుకోవడంకు రచకొండ కమిషనరేట్ లో కంట్రోల్ రూమ్ ని ఏర్పాటుచేశామని 9490617234 నెంబర్ కి సమాచారమివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో రాచకొండ ట్రాఫిక్ డీసీపీ దివ్య చరణ్, మల్కాజిగిరి ఏసీపీ నర్సింహ రెడ్డి, ఆర్టిస్ట్ భీమా రాజు, రాచకొండ పొలిస్ సిబ్బంది పాల్గొన్నారు.

Post Top Ad