శుభ తెలంగాణ (27,ఏప్రిల్ , 2020) - కూకట్ పల్లి : కరోనా వైరస్ విస్తృతంగా విజృంభిస్తున్న తరుణంలో కూకట్ పల్లి నియోజకవర్గంలో తీసుకుంటున్న చర్యలపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆదివారం ఉదయం 7 గంటలకు మొత్తం అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, అధ్యక్షులు, ఇంచార్జిలు, మరియు జిహెచ్ఎంసి అధికారులు, జలమండలి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు . 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం సందర్భంగా అన్ని డివిజన్ లో నిరాడంబరంగా సామాజిక దూరాన్ని పాటిస్తూ.. అతి కొద్ది మంది సమక్షంలో పార్టీ జెండాను ఎగుర వేయాల్సిందిగా..సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ.. ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు ఒక ధైర్యం చెబుతూ.. నేనున్నానంటూ భరోసా ఇస్తూ.. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బియ్యం నిత్య వసర సరుకులను అందజేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రానికి దక్కడం మన అదృష్టమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ లు ప్రజలకు బియ్యం నిత్యవసరాల సరుకులు కానీ అందుబాటులో లేకపోతే తక్షణమే నా దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాగే రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి అని ఆదేశాలు జారీ చేశారు. ఈ పవిత్రమైన మాసంలో వారికి అండగా ఉండాలని వారు పాటించే ఆహార నియమాలకు సంబంధించి వారికి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే సహాయం చేయాలని కోరారు.
Post Top Ad
Monday, April 27, 2020
Admin Details
Subha Telangana News