రాచకొండ కమిషనరేట్ లో పోలీసు అధికారులకు సానిటయిజర్లు, మాస్కులు, గ్లౌజులు అందచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 30, 2020

రాచకొండ కమిషనరేట్ లో పోలీసు అధికారులకు సానిటయిజర్లు, మాస్కులు, గ్లౌజులు అందచేసిన మంత్రి తలసాని శ్రీనివాస్


శుభ తెలంగాణ (30.ఏప్రిల్ , 2020) - రాచకొండ  :  కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రాణాలకు తెగించి పోలీసులు చేస్తున్న సేవలు అమోఘమని మంత్రి తలసాని శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు రాచకొండ కమిషనరేట్ లో ఆయన పోలీసు అధికారులకు సానిటయిజర్లు, మాస్కులు, చేతి గ్లౌజులు అందజేశారు. అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో పోలీసుల సేవలను, వారి పనితీరును కొనియాడారు. రాచకొండ కమీషనరేట్ పరిధిలో కమీషనర్ మహేష్ భగవత్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. కమీషనరేట్ పరిధిలో సీపీ మహేష్ భాగవత్ నేరాల నిర్ములనకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సీసీ కెమరాలు ఏర్పాటు చేసారని ఆయన అన్నారు. ఒకప్పుడు పోలీసులు అంటే ఒక రకమైన నెగిటివ్ అభిప్రాయం ఉండేదని, కానీ ఇప్పుడు పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవను చూసి చాలామందికి మంచి అభిప్రాయం కలుగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఇప్పుడు కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రాణాలకు తెగించి పోలీసులు చేస్తున్న సేవలు అమోఘమని అన్నారు. ప్రభుత్వ పిలుపు మేరకు లాక్ డౌన్ సమయంలో పేదలు పస్తులు ఉండకూడదనే సంకల్పంతో ఎక్కడికక్కడ దాతలను సమీకరించి పేదలకు నిత్యావసరాలను అందిస్తున్నారని రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ ని అభినందించారు. ఈకార్యక్రమంలో పోలీసులకు మంత్రి తలసాని 10 లక్షల రూపాయల విలువ చేసే సానిటయిజర్లు, మాస్కులు, చేతి గ్లౌజులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్, అడిషనల్ సీపీ సుధీర్ బాబు, ఉప్పల్ ఎమ్మెల్యే భేటి సుభాష్ రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి, ఏడీసీపీ అడ్మిన్, డీసీపీ క్రైమ్స్, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.