కంటైన్మెంట్ ప్రదేశాలను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 21, 2020

కంటైన్మెంట్ ప్రదేశాలను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ

శుభ తెలంగాణ (21, ఏప్రిల్ , 2020 -హైదరాబాద్ ) : సోమవారం కీసర మండలంలోని చీర్యాల, శామీర్ పేట్ మండలంలోని తుర్కపల్లి, జీహెచ్ఎంసీ పరిధిలోని అల్వాల్ కంటైన్మెంట్ ప్రదేశాలను జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కంటైన్మెంట్ ఏరియాలో కరోనా వైరస్ ఉన్నందున ప్రజలు ఎవరు బయటకు రాకుండా ఉండాలని తెలిపారు. ఆ ప్రదేశాలలో బారికేడ్లను పరిశీలించి ప్రజలు ఎవరూ కూడా బయటికి రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. కంటైన్మెంట్ ఏరియాలో పరిస్థితుల స్థితిగతులను అధికారులతో చర్చించారు.

వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. కంటైన్మెంట్ ఏరియాలో ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కరోనా నిర్మూలించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత, ఆర్డీవోలు రవి, మల్లయ్య, శామీర్ పేట్  ఎమ్మార్వో గోవర్ధన్, అల్వాల్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ యాదయ్య, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.