కార్మికులను ఆదుకోవాలని హైకోర్టులో పిటిషన్ - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 06, 2020

కార్మికులను ఆదుకోవాలని హైకోర్టులో పిటిషన్

కరోనా నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ వల్ల అసంఘటిత రంగ కార్మికులు ఉపాధి కోల్పోయారని, వారిని ఆదుకోవాలని చెరుకు సుధాకర్, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్ రావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ 
ను హైకోర్టు చీఫ్ జస్టీస్ రాఘవేంద్రసింగ్ చౌహన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించారు. ప్రభుత్వం తరపు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. నగరంతో పాటు ప్రధాన పట్టణాల లో ఉన్న వారి ఇంటి వద్దకు వెళ్లి కరోనా పరీక్షలు జరపాలన్న పిటీషనర్ల తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. పిటీషనర్లు లేవనెత్తిన అంశాలపై మధ్యంతర నివేదిక సమర్పించాలని ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఏప్రిల్ 9 కి వాయిదా వేసింది.

Post Top Ad