నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగే వారిపై కఠిన చర్యలు - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 22, 2020

నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగే వారిపై కఠిన చర్యలు

శుభ తెలంగాణ (22 , ఏప్రిల్ , 2020 - అల్వాల్ ) : లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని, నిబంధనలు ఉల్లంఘించి బయట తిరిగే వారిపై చర్యలు తీసుకుంటామని అల్వాల్ సిఐ యాదగిరి అన్నారు. మంగళవారం అల్వాల్ పోలీవ్ స్టషన్ పరిధిలో సిఐ పులి  యాదగిరి ఆధ్వర్యంలో పోలీసులు వినూత్న పద్దతిలో లాక్ డౌన్ చర్యలు చేపట్టారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని మచ్చ బొల్లారం, ఓల్డ్ అల్వాల్ ఐజీ స్టాట్యూతో పాటు పలు ప్రాంతాలలో సైకిళ్లు పై పర్యటిస్తూ రోడ్లుపై తిరిగి ప్రజలను ఇండ్లలోకి పంపించారు. బైకులపై తిరిగే పలువురిని పోలీస్  స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ వరప్రసాద్, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, కానిస్టేబుల్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.