లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలి: సైబరాబాద్ సీపీ......... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలి: సైబరాబాద్ సీపీ.........

శుభతెలంగాణ న్యూస్:మేడ్చల్:సైబరాబాద్ బాలానగర్ జోన్ లో ని కెపిహెచ్ బి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో లాక్ డౌన్ అమలుతీరుపై ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేసిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీ వీసీ సజ్జనార్, ఐపిఎస్. కెపిహెచ్ బి లోని రైతు బజార్, ఇతర ప్రాంతాలను పరిశీలించిన సీపీ. మార్కెట్ కమిటీ, వ్యాపారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీపీ. షాపు కు షాపు కు మధ్య దూరం ఉండేలా చూడాలని సూచన. మార్కెట్లో ప్రజలు గుమికూడకుండా  చూడాలన్నారు.
వాహనదారులను ఆపి ఎందుకు బయటకు వచ్చారని వివరాలు ఆరా తీశారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా బయటకు వస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. లాక్ డౌన్ తోనే వైరస్ కిక్ డౌన్ అవుతుందని ప్రజలకు సూచించారు.ప్రజలు ప్రతీ ఒక్కరూ మాస్కులను ధరించాలన్నారు. తరచుగా చేతులను శుభ్రం చేసుకోవాలన్నారు. ఒక శానిటైజర్ ను దగ్గర ఉంచుకోవాలన్నారు.ప్రజలు సామాజిక దూరాన్ని/ సోషల్ డిస్టెన్స్ ను పాటించాలన్నారు. ప్రతీ ఒక్కరూ లాక్ డౌన్ కు సహకరించాలన్నారు.లాక్ డౌన్ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని కే‌పి‌హెచ్‌బి ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ ను ఆదేశించారు. సీపీ గారి వెంట కే‌పి‌హెచ్‌బి ఇన్స్పెక్టర్ లక్ష్మినారాయణ, ఇన్ స్పెక్టర్ రామచంద్ర రావు తదితరులు ఉన్నారు.

Post Top Ad