ములక్కాయల కోసం లాక్ డౌన్ ఉల్లంఘన : బైక్ సీజ్ చేసిన పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 23, 2020

ములక్కాయల కోసం లాక్ డౌన్ ఉల్లంఘన : బైక్ సీజ్ చేసిన పోలీసులు

శుభ తెలంగాణ (23,ఏప్రిల్,2020-ఉప్పల్) : కరోనా వైరస్ వ్యాప్తి  కట్టడికి పోలీసు అధికారులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తుంటే కొందరు మాత్రం ఇవేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఉప్పల్ కు చెందిన ఓ యువకుడు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ బైక్ తో రోడ్లమీద తిరుగుతున్నాడు. ములక్కాయల కోసం అతడు లాక్ డౌన్ ఉల్లంఘించడం గమనార్హం. ఉప్పల్ రింగ్ రోడ్ లో లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న  యువకుడిని పోలీసులు  అడ్డుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నావని ట్రాఫిక్ పోలీసులు ప్రశ్నించగా.. నాలుగు ములక్కాయలు  తీసుకొని వెళ్లి వనస్థలిపురంలో ఇచ్చి వస్తాను అని అతడు సమాధానమిచ్చాడు. దీంతో పోలీసులు యువకుడు తీసుకొచ్చిన బైక్ ను సీజ్ చేసి తీసుకెళ్లారు.