ఆసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి లో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేత - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, April 12, 2020

ఆసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూకట్ పల్లి లో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేత

కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న కోద్ది లాక్ డౌన్ ను ప్రభుత్వం మరింత కఠినంగా అమలు చేస్తోంది. ఐతే దీని ప్రభావం రోజు వారి కూలీలపై పడుతోంది. దీంతో పలు స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి వారికి ఆహార ప్యాకెట్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఆసా ఫౌండేషన్
ఆధ్వర్యంలో కూకట్ పల్లిలోని రోడ్ నెంబర్ -1 లో పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను ఈ రోజు అందజేశారు. అమెరికాకు చెందిన ఎస్ఆర్ఎ దాతల ద్వారా దాదాపుగా 50 వేల విలువైన నిత్యవసర సరుకులను పంపిణీ చేసినట్లు నిర్వహకురాలు సోనియా తెలిపారు. పంపిణీ చేసిన కిట్టలో  బియ్యం , పప్పు, నూనె, పసుపు, ఉల్లి, కారంతో పాటు పేస్ట్ ఉన్నాయని అన్నారు.

Post Top Ad