బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 16, 2020

బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్

శుభ తెలంగాణ (16,ఏప్రిల్ , 2020)  :  రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయవచ్చని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎంపీ గురువారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో రక్తదానం చేసి  ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలన్నారు. సమాజంలో ప్రతి పౌరుడు బాధ్యతగా ఉంటూ సమాజహిత కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ముందుండాలన్నారు. తలసేమియా, ఇతర వ్యాధులతో బాధ పడుతున్న వారి కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.  కరోనా నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటుం దన్నారు. ప్రజలంతా మే 3 వరకు లాక్ డౌనన్ను పాటించి కరోనా నివారణకు సహకరించాలన్నారు. అత్యవసర   సేవలందిస్తున్న వైద్య, పోలీస్, పారామెడికల్ సిందికి ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Post Top Ad