ఎస్బీఐ నుండి అదిరిపోయే స్కీమ్ : త్వరపడండి - Subha Telangana

Breaking

Post Top Ad

Monday, April 20, 2020

ఎస్బీఐ నుండి అదిరిపోయే స్కీమ్ : త్వరపడండి

శుభ తెలంగాణ (20, ఏప్రిల్ , 2020) , న్యూ ఢిల్లీ ; అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) తన కస్టమర్లకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. ఇందులో ఎస్ బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కూడా ఇందులో ఒక భాగమే. ఈ స్కీమ్ ద్వారా డిపాజిట్ దారులు ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. దీని కోసం ముందుగానే నిర్ణీత మొత్తాన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పదవీ విరమణ చేసిన వారికి ఎస్ బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దీని ద్వారా సేవింగ్స్ పై ప్రత నెలా రెగ్యులర్ గా ఆదాయం పొందొచ్చు. మీరు డిపాజిట్ చేసిన తేదీ రోజునే ప్రతి నెలా డబ్బులు లభిస్తాయి. ఒకవేళ 29, 30, 31 వంటి తేదీల్లో మీరు డిపాజిట్ చేసి ఉంటే.. అప్పుడు నెల తొలి రోజున డబ్బులు చెల్లిస్తారు. మీరు చెల్లించిన ప్రిన్సిపల్ అమౌంట్ లో కొంత భాగం, వడ్డీ మొత్తాన్ని కలిపి ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తారు. టర్మ్ డిపాజిట్లకు వర్తించే వడ్డీ రేటే ఈ స్కీమ్ కు కూడా వర్తిస్తుంది. ఎస్ బీఐ వెబ్ సైట్ ప్రకారం.. ప్రస్తుతం 5.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఏడాది నుంచి 10 ఏళ్ల కాల పరిమితిలోని ఎఫ్ డీలకు ఈ రేటు వర్తిస్తుంది. వడ్డీ అనేది మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. నెలవారీగా చెల్లిస్తారు. భారతీయులు ఎవరైనాసరే ఈ స్కీమ్ లో చేరొచ్చు .
Post Top Ad