గడ్డి అన్నారం మార్కెట్ లో కనిపించని సోషల్ డిస్టెన్స్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 02, 2020

గడ్డి అన్నారం మార్కెట్ లో కనిపించని సోషల్ డిస్టెన్స్


ఒక పక్క కరోనా వైరస్ కలవరం పెడుతుంటే.. మరో పక్క ఆరోగ్య నియమాలకు తూట్లు పొడుస్తున్న కొత్తపేటలోని గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ అధికారులు సిబ్బంది. అతిపెద్దది అయిన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ కు రోజు అనునిత్యం వందలాది మంది తన సరుకులను తీసుకొని
వస్తూ.. విక్రయిస్తు వెళ్ళడం జరుగుతుంది.
అన్ని రకాల పండ్లు ఒకే చోట హోల్ సేల్ గా
లభించడంతో ..కొనుగోలుదారులందరు గుంపులు
గుంపులుగా మార్కెట్ కు రావడంతో రద్దీగా మారడంతో ఆ ప్రాంతం మొత్తం జనసంద్రంగా మారుతుంది.

ఒకపక్క కరోనా భారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి అని.. అవగాహనాలు కల్పిస్తుంటే ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నది. ఏ ఒక్కరికి కుడా మాస్క్ లు లేకపోవడం , లోపలికి వచ్చే వారికి శానిటైజర్ ఇవ్వక పోవడం , దూరం దూరం పాటించక పోవడం , మార్కెట్ లోని వ్యాపారస్తులకు కుడా ఎలాంటి
జాగ్రత్తలు , అవగాహన కల్పించకపోవడం బాధాకరం.

ఈ రద్దీ సమయంలో ఒకవేళ జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని కొంతమంది కొనుగోలు దారులు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్న మార్కెట్ కమిటీ కానీ , వ్యవసాయ శాఖ అధికారులు , సిబ్బంది పట్టించకపోవడం చాల బాధాకరమని కొనుగోలు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Post Top Ad