గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరోనా రోగి మృతి....... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, April 01, 2020

గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరోనా రోగి మృతి.......

హైదరాబాద్‌:తెలంగాణలో మరో కరోనా మరణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతిచెందాడు.  దీంతో రాష్ట్రంలో ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7కి చేరింది.

తమ ఆస్పత్రిలో కరోనా రోగి మృతిచెందినట్టు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ శ్రవణ్‌ వెల్లడించారు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడి చేశారన్నారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులపై దాడి సరికాదన్నారు. ఈ ఘటనను వైద్యారోగ్యశాఖ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

Post Top Ad