కరోనా నివారణ చర్యలను పర్యవేక్షించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 16, 2020

కరోనా నివారణ చర్యలను పర్యవేక్షించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్

శుభ తెలంగాణ (16,ఏప్రిల్ , 2020)  :  కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 128 చింతల్ డివిజన్  పరిధిలోని వల్లభాయ్ పటేల్ నగర్ లో మహమ్మారి 'కరోనా వైరస్' కట్టడికి 'సోడియం హైపో క్లోరైడ్' రసాయాన్ని స్ప్రే చేస్తున్నారు. ఈ స్పే విధానాన్ని గురువారం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యవేక్షించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రభుత్వం కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని, ప్రజలు ఎవ్వరూ భయాందోళనకు గురికావద్దన్నారు. అధికారులు, వైద్య సిబ్బంది, పూర్తిస్థాయి  అప్రమత్తతతో ఉన్నారని, సమస్య వచ్చిందంటే రెప్పపాటులో స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ కార్యక్రమంలో వల్ల భాయ్ పటేల్ నగర్ ప్రెసిడెంట్ శేఖర్ రావు, సుదర్శన్ రెడ్డి, ఐలయ్య యాదవ్, కుమార్ యాదవ్, వెంకటేష్, ఇర్ఫాన్, మోహన్ రెడ్డి, అనీల్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.