మల్కాజిగిరిలో మీడియా విలేకరులకు సానిటైజర్లు, మాస్కులు పంపిణి : పాల్గొన్న పోలీసులు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 23, 2020

మల్కాజిగిరిలో మీడియా విలేకరులకు సానిటైజర్లు, మాస్కులు పంపిణి : పాల్గొన్న పోలీసులు

శుభ తెలంగాణ (23,ఏప్రిల్,2020-హైదరాబాద్) : తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళలో కూడా  కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకుని అత్యవసరమైతేనే బయటకు రావాలని మీడియా మిత్రులకు నేరేడ్ మెట్ సిఐ నర్సింహ స్వామి సూచించారు. బుధవారం మల్కాజిగిరి, నేరేడ్ మెట్ లకు చెందిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా విలేకరులకు సానిటైజర్లు, మాస్కులు, చేతి  గాజులు, ముఖానికి పెట్టె వైజర్లను అందజేశారు. మీడియా తరపున నేరేడ్ మెట్ సిఐ కు విలేఖరులు ధన్యవాదాలు తెలిపారు.