కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కూకట్ పల్లిలో బియ్యం,కూరగాయాలు పంపిణి - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 23, 2020

కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కూకట్ పల్లిలో బియ్యం,కూరగాయాలు పంపిణి

శుభ తెలంగాణ (23,ఏప్రిల్,2020- కూకట్ పల్లి) :కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎల్లమ్మ బండ, పీజేఆర్ నగర్ లో స్థానిక కార్పొరేటర్డాడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఎండీ ముజీబ్ పలు నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక దూరాన్ని పాటిస్తూ అవకాశం ఉన్న ప్రతివారు పెద్ద మనస్సు చేసుకొని తోటి పేదవారిని ఆదుకోవాలని కార్పొరేటర్ నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామకృష్ణ గౌడ్, శివరాజ్ గౌడ్, ముర్తుజ, మహేష్, ఖలీం, అహ్మెద్, సురేఖ తదితరులు పాల్గొన్నారు.