వలస కార్మికుల ఆకలి తిరుస్తున్న స్నేహ హస్తం ట్రస్ట్........ - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 16, 2020

వలస కార్మికుల ఆకలి తిరుస్తున్న స్నేహ హస్తం ట్రస్ట్........

                   
శుభతెలంగాణ(16ఏప్రిల్20) మేడ్చల్ జిల్లా యాప్రాల్ లోని భగత్ సింగ్ కాలనీలో లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న 500 మంది వలస కార్మికుల ఆకలిని తీర్చి రెండు పూటలా వారి కడుపు నింపుతున్న స్నేహ హస్తం ట్రస్ట్.ఈ సందర్భంగా 130వ డివిజన్ కార్పొరేటర్ శ్రీదేవి  మాట్లాడుతూ... కరోనా అంటూవ్యాధి వల్ల కూలీలకు వెళ్ళలేక అటు వారి రాష్ట్రాలకు వెళ్ళలేక ఇబ్బందిపడుతున్న వలస కార్మికులకు అండగా నిలిచి ఆకలి తీరుస్తున్న   స్నేహ హస్తం ట్రస్ట్ వారినిఅభినందిస్తున్నానని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సేవలందిస్తున్నాయి అని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వారు చేసే సేవలు మరువలేనివని కొనియాడారు.
 అనంతరం ట్రస్ట్ కార్యనిర్వాహకులు మాట్లాడుతూ..
స్నేహ హస్తం ట్రస్ట్ చైర్మన్ ఏజెకిల్ ఆదేశాల మేరకు  కరోనా అంటువ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ వల్ల వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయిందని ప్రభుత్వం వారికి అండగా నిలిచిన పూర్తిస్థాయిలో కొంతమంది వలస కార్మికులు లబ్ధి పొందే లేక పోతున్నారని.వారిని గమనించి వారి యొక్క ఆకలి తీర్చాలని లక్ష్యంతో స్నేహ హస్తం ట్రస్ట్ 500 మంది వలస కార్మికుల కడుపు నింపుతున్నమని తెలియజేశారు.
గత 15 రోజులుగా వలస కార్మికులకు రెండు పూటల భోజనాన్ని అందిస్తున్నామని లాక్ డౌన్  ఉన్నన్ని రోజులు వారికి భోజనం అందిస్తామని తెలియజేశారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజలు ఎవరు మే 3 వరకు ఇంటి నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలోట్రస్ట్ సభ్యులు ప్రవీణ్ కుమార్,రమేష్,ప్రవీణ్ జాన్,మహేష్ యాదవ్, జిలాని,రాజేష్,కిషన్ తదితరులు పాల్గొన్నారు....