కరోనా మహమ్మారిని తరిమికొడదాం: ఎంపీ బండి సంజయ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 17, 2020

కరోనా మహమ్మారిని తరిమికొడదాం: ఎంపీ బండి సంజయ్

శుభ తెలంగాణ (17, ఏప్రిల్ , 2020) :  కరోనా మహమ్మారి వలన మన దేశంలో లాక్ డౌన్  విధించడంతో రక్త సేకరణకు ఇబ్బంది ఏర్పడి రాష్ట్రంలో బ్లడ్ బ్యాంకుల్లో, ఆసుపత్రిలో రక్త నిల్వలు తగ్గిపోయాయి. తలసేమియా వ్యాధితో ఎంతో మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు  సభ్యులు బండి సంజయ్ నేతృత్వం లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో గురువారం బీజేపీ జిల్లా నాయకులు కె.సచిందర్ రెడ్డి నేను సైతం అంటూ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలందరూ ఇంట్లోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకొని కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటించి కరోనా  మహమ్మారిని తరిమి కొట్టాలని సూచించారు.   ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ, జిల్లా సమన్వయ కర్త కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు దుడ్డెల లక్ష్మి నారాయణ, ఎంపీటీసీ ముదిమానిక్యం, ఎంపీటీసీ సభ్యులు ఏలేటి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad