కరుణ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరులాక్ డౌన్ కొనసాగించాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

కరుణ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరులాక్ డౌన్ కొనసాగించాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.....

శుభతెలంగాణ న్యూస్(వికారాబాద్ జిల్లా) వికారాబాద్ లో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రజలంతా తప్పనిసరి గా లాక్ డౌన్ ను పాటించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.వికారాబాద్ నియోజకవర్గములో  కరోనా దృష్ట్యా ఏర్పడిన పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిత్యావసరాల పంపిణీ,ధాన్యం కొనుగోలు తదితర అంశాల పై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎంపి రంజిత్ రెడ్డి, ఎంఎల్ఏ మెతుకు ఆనంద్,కలెక్టర్ పౌసుమి బసు, ఎస్ పి నారాయణ,రాష్ట్ర విద్య మౌలిఖా సదుపాయాల ఛైర్మెన్ ఛైర్మెన్ నాగేందర్ గౌడ్,వివిధ శాఖల అధికారులతో కలిసి శనివారం మంత్రి సమీక్షించారు..ఈ సందర్భంగా ప్రస్తుతం కేసుల సంఖ్య జిల్లాలో 10 కి పెరగటం తో వ్యాధి ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని  పోలీస్ ,వైద్య ,మునిసిపల్ అధికారులను ఆదేశించారు.వికారాబాద్ జిల్లాలో మొత్తం 10 కేసులు నమోదు అయితే అందులో సగానికి పైగా వికారాబాద్ నియోజకవర్గము నుండే ఉండటం ఆందోళన కల్గించే అంశం అని,ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటిస్తూ, కరోనా లక్షణాలు ఉంటే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేపించుకోవలన్నారు.వికారాబాద్ లోని ఏరియా ఆస్పత్రికి గర్భిణి లు,ఇతర అత్యవసరము ఉన్న వాళ్ళు వెల్తునందున,దగ్గు,జలుబు,జ్వరం,గొంతులో నొప్పి,శ్వాస కోసఇబ్బందులు,కరోనా లక్షణాలు ఉన్న వారు మహావీర్ ఆస్పత్రికి కి  వెళ్లాలని మంత్రి కోరారు.
 
వికారాబాద్  మునిసిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహ కల్ప లో మంత్రి పర్యటించారు.ఎం ఎల్ ఏ మెతుకు ఆనంద్,కలెక్టర్ పౌసుమి బసు ,మునిసిపల్ చైర్ పర్సన్ చిగుళ్ల పల్లి మంజుల రమేష్ లతో కలిసి పర్యటించారు.వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ,సామాజిక దూరం పాటించాలని,స్వీయ రక్షణ నే శ్రీరామ రక్ష అన్నారు.గృహ కల్ప లో ప్రజలు ప్రభుత్వ నికి సహకరించాలన్నారు.

Post Top Ad