బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను పంపిణి చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, April 16, 2020

బియ్యం, నిత్యావసర సరుకులు మరియు కూరగాయలను పంపిణి చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

శుభ తెలంగాణ ( 16, ఏప్రిల్ , 2020) :  కరోనా కష్టాల నుంచి పండ్ల రైతులను ఆదుకోవాలని  ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునందుకొని వైయస్ఆర్ ట్రస్టు ఇప్పటికే పెద్దఎత్తున పండ్లను తోటల వద్దనే కొన్న విషయం మీకు తెలిసిందే. సిట్రస్ పండ్లు కోతకు సిద్ధంగా ఉన్నాయని వాటిని కొనుగోలు చేయాలని మంత్రులు మల్లారెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు పల్లె రాజేశ్వర్ రెడ్డి కూడా సూచనలు చేస్తున్నారు. ఈ సమయంలో ట్రస్టులు, సోషల్ ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చి కరోనా వైరస్ నిరోదానికి ఉపయోగపడే సిట్రస్ పండ్లు అయిన బత్తాయి, నిమ్మ లాంటి పండ్లను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వైయస్ఆర్ ట్రస్టు చైర్మన్ ఏనుగు  సుదర్శన్ రెడ్డి తెలిపారు.లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందిపడుతున్న నిరుపేదలకు కే.పి.హెచ్.బి కాలనీ లోని పలు చర్చిల్లో కుటుంబాలకు బియ్యం మరియు నిత్యావసర సరుకులు కూరగాయలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పంపిణీ చేశారు. అంతేకాక  కూకట్ పల్లి నియోజకవర్గ జర్నలిస్టులకు మాస్కులు,  శానిటైజెర్, గ్లోజులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ నేపథ్యంలో అందరి ఆకలి తీర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.