హైదరాబాద్ కుషాయిగూడ లోని వైన్ షాపు నుండి మద్యం బాటిళ్లు తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన వైన్ షాప్ క్యాషియర్... - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, April 14, 2020

హైదరాబాద్ కుషాయిగూడ లోని వైన్ షాపు నుండి మద్యం బాటిళ్లు తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన వైన్ షాప్ క్యాషియర్...

శుభతెలంగాణ(14ఏప్రిల్20) హైదరాబాద్  రాచకొండ పోలీసు కమిషనరేట్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని మహేష్ నగర్ లో ఉన్న తేజ వైన్స్ షాపు యజమాని సిద్ధి రాములు గౌడ్ ఆదేశాలతో అందులో క్యాషియర్ గా పనిచేస్తున్న చిమ్ముల వాసురెడ్డి అతని స్నేహితుడు చెరుకుపల్లి లింగారెడ్డి ఇద్దరు కలిసి మారుతి సెలారియో వాహనంలో వైన్స్ షాపుకు ఎక్సైజ్ పోలీసులు వేసిన సీలు తొలగించి సుమారు 41 వెయ్యి రూపాయల విలువ చేసే 41 మెక్ డోవెల్స్ ఫుల్ బాటిళ్లు, 18 రాయల్ స్టాగ్ ఫుల్ బాటిళ్లు కారులో తరలిస్తుండగా బ్లూకోల్ట్, పెట్రోలింగ్ పోలీసులు చేజ్ చేసి పట్టుకుని కుషాయిగూడ పోలీసు స్టేషన్ కు తరలించి మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని,కారును సీజ్ చేసి,అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరిపై 448, 427, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన కుషాయిగూడ పోలీసులు, పరారీలో తేజ వైన్స్ యజమాని సిద్ధి రాములు గౌడ్, ప్రభుత్వ నిబంధనలను భేఖాతారు చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన కుషాయిగూడ సిఐ చంద్రశేఖర్.

Post Top Ad