రేపటి నుండే రంజాన్ ఉపవాసాలు ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, April 24, 2020

రేపటి నుండే రంజాన్ ఉపవాసాలు ప్రారంభంహైదరాబాద్‌ :
  రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం నెలవంక దర్శనమిచ్చింది. రంజాన్ మాసాన్ని ముస్లింలు ఎంతో పవిత్రంగా భావిస్తారు. నెల రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రంజాన్‌ మాసంలో ఇంట్లోనే నమాజు చేయాలని ముస్లింలకు ఢిల్లీలోని జామా మసీదు, ఫతేపురి మసీదు షాహీ ఇమామ్‌లు సూచించారు. కరోనా వైరస్‌ వ్యాపించకుండా సహకరించాలని కోరారు. కరోనా నేపథ్యంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా సూచించిన విషయం తెలిసిందే.