ఒక్కటి కూడా పాజిటివ్ నమోదు కాలేదు: యాదాద్రి - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, April 11, 2020

ఒక్కటి కూడా పాజిటివ్ నమోదు కాలేదు: యాదాద్రి

యాదాద్రి భువనగిరి జిల్లా సేఫ్ జోన్ లో ఉంది. ఉమ్మడి జిల్లాలోని సూర్యాపేట, నల్గొండ లో కరోనా పాజిటివ్ కేసులు ఉంటే యాదాద్రి జిల్లాలో ఒక్కటి కూడా పాజిటివ్ నమోదు కాలేదు. ఉమ్మడి జిల్లాలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జి కాగా, 12 మంది మృతి చెందారు.
ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ - 49, కామారెడ్డి -10, ఆదిలాబాద్ జిల్లా - 10, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా - 4, భూపాలపల్లి - 2, హైదరాబాద్ - 200, జగిత్యాల - 2, జనగాం - 2, జోగులాంబా గద్వాల్ - 19, కరీంనగర్ -18, మహబూబాబాద్ - 1, మహబూబ్ నగర్ - 11, మెదక్ - 5, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా - 23,
ములుగు - 2, నల్గొండ- 12, నాగర్ కర్నూల్ - 2, నిర్మల-15, పెద్దపల్లి- 2, రంగారెడ్డి - 34, సంగారెడ్డి - 7, సిరిసిల్ల - 1, సిద్దిపేట - 1, సూర్యాపేట - 9, ఖమ్మం - 2, వికారాబాద్ - 8, వరంగల్ అర్బన్ జిల్లాలో 24 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Post Top Ad